logo

పదిలో మెరుగైన ఫలితాలు

జిల్లాలో 11,380 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 95.76 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది.

Published : 01 May 2024 03:21 IST

జిల్లాలో 101 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత

10 జీపీఏ సాధించిన తాటిపల్లి గురుకుల విద్యార్థినులను అభినందిస్తున్న జిల్లా కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషా, చిత్రంలో డీఈవో జగన్మోహన్‌రెడ్డి, ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో 11,380 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 95.76 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. బాలికలు 96.62 శాతం, బాలురు 95.76 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 2023 ఫలితాల్లో జిల్లాలో 84.05 శాతం ఉత్తీర్ణత నమోదైతే ఈసారి మరో 10 శాతం పెరిగింది. జిల్లాలోని 101 పాఠశాలలలు 100 శాతం ఫలితాలు సాధించడం విశేషం. 146 మంది విద్యార్థులు 9.5 జీపీఏ సాధించగా 100 మంది 9.7, 83 మంది 9.8, 25 మంది 10 జీపీఏ సాధించారు.

జిల్లాలోని 232 ప్రభుత్వ పాఠశాలల్లో 85 శాతంపైనే ఉత్తీర్ణత నమోదైంది. దాదాపు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2023 కంటే ఫలితాలు మెరుగుపడ్డాయి. వార్షిక పరీక్షలకు ముందు కలెక్టర్‌ యాస్మిన్‌బాషా సూచనల మేరకు జిల్లా విద్యాశాఖ 3 నెలల ప్రత్యేక కార్యాచరణ సత్ఫలితాలనిచ్చింది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులతోపాటు నమూనా వార్షిక పరీక్ష షెడ్యూల్‌ నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 84.23 శాతం ఉత్తీర్ణత, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 93.38, ఆదర్శ పాఠశాలల్లో 97.96, కేజీబీవీల్లో 95.50, తెలంగాణ సోషల్‌వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 97.82, టీఎస్‌ఆర్‌ఎస్‌ 100, బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 99.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది.

మండలాల్లోనూ 90 శాతంపైనే..

జిల్లాలోని 19 మండలాల్లో రెండు మినహా 17 మండలాల్లో ఫలితాలు 90 శాతంపైనే నమోదయ్యాయి. బుగ్గారం మండలంలో వంద శాతం ఫలితాలు వచ్చాయి. బీర్‌పూర్‌ 98.67, ధర్మపురి 96.27, గొల్లపల్లి 85.89, ఎండపల్లి 87.50, ఇబ్రహీంపట్నం 93.53, జగిత్యాల 96.21, జగిత్యాల గ్రామీణం 96.42, కథలాపూర్‌ 94.73, కొడిమ్యాల 92.80, కోరుట్ల 92.72, మల్లాపూర్‌ 95.23, మల్యాల 98.25, మేడిపల్లి 98.28, మెట్‌పల్లి 97.98, పెగడపల్లి 94.86, రాయికల్‌ 97.33, సారంగపూర్‌ 96.47, వెల్గటూర్‌ 97.49 శాతం ఫలితాలు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని