logo

ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన భాజపా, భారాసలు

భారతీయ జనతా పార్టీ, భారాసలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు.

Published : 01 May 2024 03:05 IST

రామన్నపేటలో మాట్లాడుతున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట, న్యూస్‌టుడే: భారతీయ జనతా పార్టీ, భారాసలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. కోనరావుపేట మండలం రామన్నపేట, కొలనూర్‌, రాజన్న గొల్లపల్లి, మర్తన్‌పేట, ధర్మారం గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా ప్రభుత్వ విప్‌ ఎన్నికల ప్రచారం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి, అభివృద్ధికి నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. ఉపాధి హామీ పథకం కూలి రోజుకు రూ.400లకు పెంచుతామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన భారాసను శాసనసభ ఎన్నికల్లో గద్దె దింపినట్లే, కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల్లో గద్దె దింపాల్సిన సమయం వచ్చిందన్నారు. భాజపా, భారాసల అవినీతి, అక్రమాల పాలనకు స్వస్తి పలకాలని కోరారు. వేములవాడ నియోజకవర్గానికి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు 3,500 మంజూరయ్యాయని, ఎన్నికల కోడ్‌తో ప్రక్రియ నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, జిల్లా నాయకులు రుక్మిణి, ఎల్లయ్య, గణేశ్‌, తిరుపతి, వెంకన్న, శ్రీనివాస్‌, రషీద్‌, మండల నాయకులు రవీందర్‌గౌడ్‌, రషీద్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని