logo

ఆ రెండు పార్టీలు ఒక్కటే

కాంగ్రెస్‌, భాజపాలు ఒక్కటేనని భారాస నిజామాబాద్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత,

Published : 01 May 2024 03:19 IST

భారాస అభ్యర్థి గోవర్ధన్‌

అల్లీపూర్‌లో ప్రచారం చేస్తున్న భారాస అభ్యర్థి గోవర్ధన్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తదితరులు

జగిత్యాల, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, భాజపాలు ఒక్కటేనని భారాస నిజామాబాద్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ ఛైర్మన్‌ లోక బాపురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలపై పోరాడే భారాసను గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఈప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నిజామాబాద్‌ ఎంపీగా అర్వింద్‌ను గెలిపిస్తే పసుపుబోర్డు పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు.  

జగిత్యాల గ్రామీణం: కాంగ్రెస్‌, భాజపా ఆసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని నిజామాబాద్‌ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లో మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంతతో కలిసి కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు.  

రాయికల్‌: ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాల అసత్య ప్రచారాలకు మోసపోవద్దని నిజామాబాద్‌ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. రాయికల్‌ మండలంలోని అల్లీపూర్‌, భూపతిపూర్‌ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన కార్నర్‌ సమావేశంలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని ఒక్కసారి కూడా జైతెలంగాణ అనలేదని విమర్శించారు. జీవన్‌రెడ్డికి పదవి ఉన్నా ఎంపీగా పోటీ చేస్తున్నారని ఎమ్మెల్సీగా ఏం చేశారో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా రాజకీయాల కోసం అరెస్టు చేశారని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ ఉచిత బస్సు తప్పితే మహాలక్ష్మి పథకంలో ఆడపడుచులకు రూ.2500 ఇవ్వలేదని అన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, మార్క్‌ఫెడ్‌ మాజీ ఛైర్మన్‌ లోక బాపురెడ్డి, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌, ఎంపీపీ సంధ్యారాణి, పురపాలిక ఛైర్మన్‌ మోర హన్మండ్లు, వైస్‌ ఛైర్‌ పర్సన్‌ గండ్ర రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల పట్టణం: మోసపూరిత హామీలను నమ్మవద్దని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని నిజామాబాద్‌ భారాస ఎంపీ అభ్యర్థి గోవర్దన్‌ అన్నారు. స్థానిక మంచినీళ్లబావి, కొత్తవాడ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి కార్నర్‌మీటింగ్‌లో ఎమ్మెల్యే సంజయ్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ ఛైర్మన్‌ లోక బాపురెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు