logo

క్యూఆర్‌ కోడ్‌తో ఓపీ రిజిస్ట్రేషన్‌

ఓపీ రిజిస్ట్రేషన్‌ కోసం వరుసలో నిల్చునే అవసరం లేకుండా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం నుంచి అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు.

Updated : 01 May 2024 07:53 IST

ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న క్యూఆర్‌ కోడ్‌

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: ఓపీ రిజిస్ట్రేషన్‌ కోసం వరుసలో నిల్చునే అవసరం లేకుండా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం నుంచి అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు వరుసలో నిలబడి ఓపీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. రద్దీ ఎక్కువగా ఉన్నపుడు కంప్యూటర్‌లో వివరాలు నమోదు చేసి ఓపీ స్లిప్‌ ఇవ్వడానికి కొంత సమయం పట్టేది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ వద్ద చరవాణితో స్కాన్‌ చేసే విధానం అమలు చేస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ టోకెన్‌ సంఖ్య వస్తుంది. దీన్ని రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ వద్ద చెబితే వెంటనే ఓపీ స్లిప్‌ను అందజేస్తారు. తద్వారా సమయం ఆదా అవుతుంది. ఓపీ ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో ఈ విధానం అమలు చేస్తున్నారని, బుధవారం నుంచి మెట్‌పల్లిలో అమలు చేస్తున్నట్లు ఆసుపత్రి పర్యవేక్షకులు సాజిద్‌అహ్మద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని