logo

ఇంటర్‌లో బాలికలదే పైచేయి

ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్‌లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు.

Published : 25 Apr 2024 04:13 IST

రాష్ట్రంలో జిల్లాకు 21వ స్థానం

వందశాతం ఉత్తీర్ణత నమోదైన సారంగాపూర్‌ కేజీబీవీలో విద్యార్థులను అభినందిస్తున్న అధ్యాపక బృందం

న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం: ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్‌లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 5,741 మంది విద్యార్థులకుగాను 3,691 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 64.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరం వొకేషనల్‌లో 1,045 మంది పరీక్షలు రాయగా 584 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఉత్తీర్ణతలో జిల్లా ప్రథమ సంవత్సరంలో 25వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 21 స్థానం సాధించింది.

సత్తా చాటుకున్న బాలికలు

ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో మూడేళ్ల్లుగా విద్యార్థినులదే పైచేయిగా నిలుస్తోంది. గత ఏడాది ప్రథమ సంవత్సర జనరల్‌ విభాగంలో బాలురు 36 శాతం ఉత్తీర్ణులైతే బాలికలు 63.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర జనరల్‌ విభాగంలో బాలురు 51.16 ఉత్తీర్ణులు కాగా బాలికలు 73.49, ద్వితీయ వొకేషనల్‌ విభాగంలో బాలురు 57.58 ఉత్తీర్ణత సాధించగా బాలికలు 68.18 ఉత్తీర్ణులయ్యారు.

తగ్గిన ఉత్తీర్ణత శాతం

గత వార్షిక పరీక్షలతో పోలిస్తే ఈసారి ఇంటర్‌లో ఉత్తీర్ణత తగ్గింది. 2023 ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది ప్రథమ సంవత్సరంలో జగిత్యాల జిల్లా 13వ స్థానం సాధించగా ఈసారి 25వ స్థానానికి పడిపోయింది. ద్వితీయ సంవత్సర పరీక్షల్లో గతేడాది 10వ స్థానం దక్కగా.. ఈసారి 21వ స్థానంలో నిలిచింది.

సౌకర్యాల కొరతే సమస్య

జిల్లాలో మూడేళ్ల ఫలితాలను విశ్లేషిస్తే ప్రభుత్వ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు కొంత మేరకు తగ్గడానికి సౌకర్యాల కొరతే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అధ్యాపకులున్నా గదుల కొరతతోపాటు ప్రయోగశాలల్లో సదుపాయాలు తగ్గిపోయాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కార్యాచరణ లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయాభావంతో భోజనం తీసుకురాలేక ఆకలితోనే పాఠాలు వినాల్సి రావడంతో చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నారు. పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పిస్తే ఫలితాలు మరింత ఆశాజనకంగా వచ్చేవని అధ్యాపకులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని