logo

రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Updated : 03 May 2024 05:35 IST

రత్నాపూర్‌లో ఉపాధిహామీ కూలీలతో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు

కమాన్‌పూర్‌,సెంటినరీకాలనీ, న్యూస్‌టుడే : రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కమాన్‌పూర్‌, సెంటినరీకాలనీ, రామగిరి మండలం రత్నాపూర్‌ శివారులో గురువారం ఉపాధి హామీ పనులు జరిగే చోట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభత్వం ఏర్పడ్డాక పనిదినాలు, వేతనాలు పెంచుతామన్నారు. పార్లమెంటు అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను ఆశీర్వదించాలని కోరారు. కమాన్‌పూర్‌, రామమగిరి మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతియాదవ్‌, ఎంపీపీ దేవక్క, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, పార్టీ అధ్యక్షుడు బాపన్న పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని