logo

స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు

వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్‌ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 03 May 2024 03:08 IST

రహదారితోపాటు చెట్ల కబ్జా

అగ్రహారం గుట్ట సమీపంలో రహదారి, చెట్లను ఆక్రమించి నిర్మించిన గోడ

వేములవాడ, న్యూస్‌టుడే: వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్‌ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రహదారి నిర్మాణ సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అవి బాగా పెరిగాయి. వాటితోపాటు రహదారిని కబ్జా చేసి ఓ స్థిరాస్తి వ్యాపారి ఏకంగా సిమెంట్‌ గోడ నిర్మించాడు. గతంలో గోడ నిర్మాణానికి అనుమతి లేదని మున్సిపల్‌ అధికారులు అభ్యంతరం తెలిపారు. తరవాత పట్టించుకోలేదు. దీంతో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లు ఆక్రమించి గోడ నిర్మాణం చేశాడు. పైగా మధ్యలో చెట్లను నరికేశాడు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌ను వివరణ కోరగా ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్పకుండా తొలగిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని