logo

వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు.

Published : 03 May 2024 03:16 IST

కానుకలు లెక్కిస్తున్న ఆలయ ఉద్యోగులు

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. 21 రోజులకు రూ.1,52,15,575 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. బంగారం 218 గ్రాములు, వెండి 11 కిలోల 500 గ్రాములను భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కరీంనగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం పరిశీలకుడు సత్యనారాయణ, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

స్వామివారిని దర్శించుకున్న పీఠాధిపతి

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని గురువారం తొగుట పీఠాధిపతి మాధవానంద స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కల్యాణ మండపంలో ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో కృష్ణ ప్రసాద్‌, స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్‌శర్మ స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ప్రొటోకాల్‌ పర్యవేక్షకుడు శ్రీరాములు, పర్యవేక్షకుడు తిరుపతిరావు, ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని