logo

కష్టమొస్తే అండగా ఉన్నా: సంజయ్‌

ఓటును నియంతృత్వ పాలన సాగించిన గడీల వారసులకు వేస్తారా? మోదీని ప్రధాన మంత్రిని చేసే గరీబోల్ల నాయకుడు బండి సంజయ్‌కుమార్‌కు వేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

Published : 05 May 2024 04:37 IST

సంజయ్‌కుమార్‌ను గజమాలతో సత్కరిస్తున్న భాజపా నాయకులు

కరీంనగర్‌ కొత్తపల్లి, తెలంగాణచౌక్‌: ఓటును నియంతృత్వ పాలన సాగించిన గడీల వారసులకు వేస్తారా? మోదీని ప్రధాన మంత్రిని చేసే గరీబోల్ల నాయకుడు బండి సంజయ్‌కుమార్‌కు వేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం కొత్తపల్లి పట్టణంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల శంకర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, తదితరులతో కలిసి స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. కరీంనగర్‌ ప్రజలకు కష్టమొస్తే అండగా ఉన్నానని, ప్రజల కోసం పోరాటాలు చేస్తే 109 కేసులు పెట్టారని చెప్పారు. కొత్తపల్లిలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి జాగా లేదట... రైతుల భూమిని తీసుకుపోయి ఓ వర్గాం వాళ్లకు ఇచ్చిన ప్రభుత్వంపై పోరాడి కోర్టుకు పోయి విజయం సాధించానని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాని అభ్యర్థి లేడని, భారాస అధినేత కేసీఆర్‌ ఎప్పటికీ ప్రధాని కారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా భాజపా గెలుస్తుందని రిపోర్టులు రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి బెంబేలెత్తి పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నాడన్నారు. భాజపా 400 సీట్లు గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంపీలు ఉండరా..? వారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మద్దతు ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల శంకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి బండి సంజయ్‌ అని.. ప్రధాని మోదీకి అత్యంత ఇష్టమైన బండి సంజయ్‌ని గెలిపిస్తే కరీంనగర్‌ మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు.  ఈ సందర్భంగా పలువురు భారాస, కాంగెస్‌ నాయకులు భాజపాలో చేరారు. 

బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం

చొప్పదండి: మండలంలోని రాగంపేటకు చెందిన రైతు ఐతరవేని రాజేశం, ఆర్నకొండకు చెందిన బోగ లత వడదెబ్బతో మృతిచెందగా భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ శనివారం వారి కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మండల అధ్యక్షుడు మావురం సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బుచ్చయ్య, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని