logo

‘చివరి ఎన్నిక.. ఆశీర్వదించండి’

‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని నిజామాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రజలను కోరారు.

Published : 08 May 2024 05:14 IST

పెగడాపల్లిలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

బోధన్‌ గ్రామీణం, సాలూర, న్యూస్‌టుడే : ‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని నిజామాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రజలను కోరారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం పెగడాపల్లి, సాలూరలో మంగళవారం నిర్వహించిన కార్నర్‌ సమావేశాలకు బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంబగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా భారాస, భాజపాలు యువకుల భవిష్యత్తు నాశనం చేశాయని ఆరోపించారు. దీంతో వారు కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంపీగా ఉన్న అర్వింద్‌ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. బోధన్‌ చక్కెర పరిశ్రమ తెరిపించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ పెట్టుబడి, ఇంధన ధరలు పెంచి వారి నడ్డివిరిచారని మండిపడ్డారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వరి క్వింటా ధర రూ.3 వేలకు పెంచుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరికి రూ.500 బోనస్‌ ఇస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధరల పెరుగుదలకు ప్రధాని మోదీ కారణమని విమర్శించారు. నడిచే చక్కెర పరిశ్రమను మూసివేయించింది మాజీ సీఎం కేసీఆర్‌ అని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌, నాయకులు గంగాశంకర్‌, గౌసోద్దీన్‌, నాగేశ్వర్‌రావు, రాజిరెడ్డి, రవి, అశోక్‌, పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు