logo

ఆలయానికి ఎందుకు నిధులివ్వలేదు?

ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని రాజన్న ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

Published : 09 May 2024 04:44 IST

వేములవాడ, న్యూస్‌టుడే: ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని రాజన్న ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా బుధవారం రాత్రి వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌ నుంచి తెలంగాణ కూడలి వరకు కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. అనంతరం తెలంగాణ కూడలిలో జరిగిన కార్నర్‌ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మోదీ పర్యటనతో ఈ ప్రాంత ప్రజలు రాజన్న గుడికి ఏమైన ఇస్తారని ఆశించారని, కేవలం రాజకీయ పర్యటనగా మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ప్రసాద్‌ స్కీం కింద రాజన్న ఆలయానికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ బండి సంజయ్‌ ఎందుకు నిధులు తేలేదని నిలదీశారు. ఆయన అసమర్థతతోనే మోదీ వేములవాడకు నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. పదేళ్ల కాలంలో ప్రధానికి వేములవాడ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌,  కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మహేశ్‌, నాయకులు వెంకటస్వామి, చంద్రగిరి శ్రీనివాస్‌, చిలుక రమేశ్‌ పాల్గొన్నారు.

వేములవాడ గ్రామీణం: భాజపా మతోన్మాదంతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుందని, ప్రజలు గుణపాఠం చెప్పాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కోరారు. బుధవారం రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుడు  మీనయ్య, మండలాధ్యక్షుడు జలపతి,  తిరుపతి, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని