logo

డిజిటల్‌ మాధ్యమం.. విస్తృత ప్రచారం

ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెస్తూ పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జన బాహుళ్యంలో ఉండే మాధ్యమాల ద్వారా ఓటు ప్రాధాన్యతను వివరిస్తోంది.

Updated : 09 May 2024 05:03 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెస్తూ పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జన బాహుళ్యంలో ఉండే మాధ్యమాల ద్వారా ఓటు ప్రాధాన్యతను వివరిస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, పలు రకాల పోటీలు, విద్యా సంస్థల్లో నమూనా పోలింగ్‌ నిర్వహణతో పాటు సామాజిక మాధ్యమాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. రైల్వే, బస్‌ స్టేషన్లు, తపాలా కార్యాలయాలు, బ్యాంకులతో పాటు ఇతర కార్యాలయాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ గోడప్రతులు ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో ప్రతి చెల్లింపు తర్వాత యాప్‌లో ఓటు హక్కు వినియోగంపై ఓ ప్రచార పోస్టరు కనిపిస్తోంది. ప్రజలు అత్యధికంగా ఉపయోగించే ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగిస్తున్నారు. ఫోన్‌పేలో సగర్వంగా ఓటేద్దాం ÌÙslets vote withpride) అనే నినాదం ఆకట్టుకుంటోంది.


ప్రలోభాలు వీడండి.. నిజాయతీ చాటండి

న్యూస్‌టుడే, ధర్మపురి: మద్యం, డబ్బు వంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ఓటు వేయాలని కోరుతూ పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్న పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి మోతె నరేశ్‌ బుధవారం ధర్మపురిలో వినూత్న ప్రచారం నిర్వహించారు. ‘కాళ్లు మొక్కుతా.. ప్రలోభాలకు లొంగిపోయి అయిదేళ్ల జీవితాన్ని తాకట్టు పెట్టవద్ద’ంటూ మెడలో మద్యం సీసాలు, డబ్బు నమూనా చిత్రాలు వేసుకొని ప్లకార్డులతో పలు కూడళ్ల వద్ద దుకాణదారులకు, ద్విచక్రవాహనదారులకు విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని