logo

అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్‌బాబు

అన్నివర్గాల సంక్షేమ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Published : 10 May 2024 01:15 IST

జగిత్యాలలో మాట్లాడుతున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

జగిత్యాల,న్యూస్‌టుడే: అన్నివర్గాల సంక్షేమ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జగిత్యాల పట్టణంలోని జంబిగద్దె ప్రాంతంలో గురువారం రాత్రి కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా ప్రభుత్వం పదేళ్లు మోసం చేసిందని, 400 సీట్లు వస్తే రాజ్యాంగం తిరిగిరాస్తామని అంటున్నారని అన్నారు. కులగణన చేపట్టి జనాభా ప్రకారం నిధులు కేటాయించి అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. జీవన్‌రెడ్డి రైతులు, పుట్టిన ప్రాంత అభివృద్ధి కోసం నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేస్తున్నారని, ఆయన గెలిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రిగా అవుతారని అన్నారు. భారాస, భాజపాలు కాంగ్రెస్‌కు వచ్చే ఆదరణ చూసి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. పురపాలిక ఛైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి, మాజీ ఛైర్మన్లు గిరి నాగభూషణం, టి.విజయలక్ష్మి, నాయకులు కొత్త మోహన్‌, బండ శంకర్‌, మన్సూర్‌ ఆలీ, చంద్రశేఖర్‌గౌడ్‌, నారాయణరెడ్డి, ఎల్లారెడ్డి, గుంటి జగదీశ్వర్‌, మహేంద్రనాథ్‌, అనుమల్ల చంద్రం, ఎలిగేటి నర్సయ్య, హరికృష్ణ తదితరులున్నారు.

గొల్లపల్లి: ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గొల్లపల్లి ప్రధాన కూడలిలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు