logo

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 69.5 శాతమే!

ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును విధిగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 7,880 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Published : 10 May 2024 06:47 IST

నేటితో ముగియనున్న గడువు

కేంద్రంలో పోల్‌ చీటీలు తీసుకుంటున్న ఉద్యోగులు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కలెక్టరేట్‌: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును విధిగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 7,880 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఈ నెల 3న కరీంనగర్‌లోని సెయింట్‌ అల్ఫోన్స్‌ పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉద్యోగులకు ఫోన్లు చేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇచ్చారు. ఈ నెల 8 వరకు గడువు ఉండగా.. ఎన్నికల సంఘం ఆదేశాలతో 10వ తేదీ వరకు పొడిగించారు. గురువారం వరకు 5,482 మంది 69.5 శాతం మాత్రమే ఓటు హక్కు  వినియోగించుకున్నారు. కలెక్టర్‌ పమేలా సత్పతి గురువారం పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి ఎంతమంది ఓటు వేశారని ఆరా తీశారు. వినియోగించుకోని వారందరిలో ప్రేరణ కలిగించి వంద శాతం ఓటింగ్‌ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు