logo
Published : 03 Dec 2021 00:52 IST

ఆరుగురికి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ పురస్కారాలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌, జీవశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్ర విభాగాల్లో పరిశోధనలు చేసిన ఆరుగురికి ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఐఎస్‌ఎఫ్‌) పురస్కారాలు అందించింది. గురువారం సాయంత్రం దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఆరుగురికి- ఒక్కొక్కరికి రూ.70 లక్షల నగదు, స్వర్ణ పతకాలను అందించారు. ఈ విజేతలకు 2016 ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ పురస్కా గ్రహీత, ప్రముఖ వైరాలజిస్ట్‌ ఆచార్య గగన్‌దీప్‌ కంగ్‌ పురస్కారాలను ప్రకటించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ వ్యవస్థ, కరోనా వైరస్‌, క్షయ వ్యాధులను గుర్తించేందుకు స్వదేశీ రోబస్ట్‌ పరీక్షలు, మానవాళికి ఉపయోగపడే అణుశక్తి, లైంగిక వేధింపులు, భారతీయ న్యాయశాస్త్రం వంటి వర్తమాన అంశాలపై చేపట్టిన పరిశోధనలకు ఈ ఏడాది అత్యంత ప్రాధాన్యం కల్పించినట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు క్రిష్‌ గోపాలకృష్ణన్‌ తెలిపారు. సుదీర్ఘకాలంగా సమాజం ఎదుర్కొనే సమస్యలను లక్ష్యంగా చేసుకున్న పరిశోధనలను ఈసారి గుర్తించినట్లు చెప్పారు. ప్రపంచం ఎదుర్కొనే సమస్యలకు విజ్ఞాన రంగంలోని పరిశోధనలు కీలకంగా మారనున్నాయని ఆచార్య గగన్‌దీప్‌ కంగ్‌ అభిప్రాయపడ్డారు. ఈ పురస్కారాలు కొత్తతరం పరిశోధనలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. డాక్టర్‌ చంద్రశేఖర్‌ నాయర్‌ (ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), డాక్టర్‌ ఏంజెలా బరెటో జేవియర్‌(హ్యుమానిటీస్‌), ఆచార్య మహేశ్‌ శంకరన్‌ (లైఫ్‌ సైన్సెస్‌), డాక్టర్‌ నీరజ్‌ కయాల్‌ (గణితం), ఆచార్య వేదాంగదాస్‌ మహంతీ (భౌతికశాస్త్రం), డాక్టర్‌ ప్రతీక్ష బక్షి (సాంఘికశాస్త్రం) పురస్కారాలను అందుకున్నారు. ఇన్ఫోసిస్‌ ప్రముఖులు శ్రీనాథ్‌ బట్ని, నారాయణమూర్తి, నందన నిలేకని, మోహన్‌దాస్‌ పై తదితరులు దృశ్యమాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని