Snake Bite: రెప్పపాటులో తప్పిన ప్రమాదం
పాములతో చెలగాటం ఎంతటి ప్రమాదకరమో ఇటీవల కార్వార జిల్లా శిరసి తాలూకాలోని దేవరహొళె గ్రామంలో సంభవించినట్లుగా చెబుతున్న సంఘటన వైరల్గా మారింది...
కార్వార, న్యూస్టుడే : పాములతో చెలగాటం ఎంతటి ప్రమాదకరమో ఇటీవల కార్వార జిల్లా శిరసి తాలూకాలోని దేవరహొళె గ్రామంలో సంభవించినట్లుగా చెబుతున్న సంఘటన వైరల్గా మారింది. అక్కడి మేజ్ సయీద్ అనే యువకుడు ఏకంగా మూడు నాగు పాముల్ని నియంత్రించేందుకు చేసిన ప్రయత్నంలో ఓ పాము మోకాలి వద్ద కాటేసింది. రెప్పపాటులో అప్రమత్తం కావడంతో పాము కాటు ప్యాంట్కు మాత్రమే పరిమితమైంది. పాములతో చెలగాటం ఏమాత్రం మంచిది కాదనేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణగా స్థానికులు పేర్కొన్నారు. పాము కాటు వేసిందని తెలియగానే వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనకెలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఓ యు-ట్యూబ్ ఛానల్ కోసమే ఇలాంటి సాహసానికి పాల్పడినట్లు తెలిసింది. ఈనెల 13న ఈ సంఘటన సంభవించినట్లుగా చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్