logo

మినీ ఒలింపిక్స్‌ మెరుపులు

కర్ణాటక ఒలింపిక్‌ సంఘం నిర్వహించిన ‘మినీ ఒలింపిక్స్‌’ పోటీల ముగింపు వేడుకలు బెంగళూరు కంఠీరవ క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో యువజన, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ సి.నారాయణగౌడ, సహకార శాఖ మంత్రి

Published : 23 May 2022 01:38 IST

ముగింపు వేడుకల్లో మంత్రులు నారాయణగౌడ,

మునిరత్న నుంచి జ్ఞాపిక అందుకొంటున్న క్రీడాకారుల బృందం

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడేే : కర్ణాటక ఒలింపిక్‌ సంఘం నిర్వహించిన ‘మినీ ఒలింపిక్స్‌’ పోటీల ముగింపు వేడుకలు బెంగళూరు కంఠీరవ క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో యువజన, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ సి.నారాయణగౌడ, సహకార శాఖ మంత్రి మునిరత్న, ఒలింపిక్‌ సంఘం రాష్ట్రాధ్యక్షుడు కె.గోవిందరాజు, క్రీడాశాఖ కమిషనర్‌ హెచ్‌.ఎన్‌.గోపాలకృష్ణ, కార్యదర్శి రాజేంద్రకుమార్‌ కథారియా పాల్గొన్నారు. హాకీ, హ్యాండ్‌బాల్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన బాలబాలికల జట్లకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. హాకీ పోటీల బాలుర విభాగంలో కొడుగు, బాలికల విభాగంలో హాసన, హ్యండ్‌బాల్‌లో హావేరి (బాలురు), తుముకూరు (బాలికల) జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల డిస్కస్‌త్రో ఇవెంట్‌లో మైసూరుకు చెందిన వర్షాగౌడ స్వర్ణపతకం, భుమిక, శ్రీమయికులకర్ణి రజత, కాంస్య పతకాలను సాధించారు. బాలుర డిస్కస్‌త్రోలో ఉడుపి క్రీడాకారులు అనురాగ్‌, అవినాష్‌, రుద్రగౌడ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 4100 మీటర్స్‌ రిలేలో బెంగళూరు జట్టు స్వర్ణపతకం, బెళగావి రజత, ఉడుపి కాంస్య పతకాలు దక్కించుకున్నాయి.


డిస్కస్‌త్రో విభాగంలో పతక విజేతలు


పతకం, ప్రశంసాపత్రంతో రిలే విజేతలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని