logo

ఓటు రాజ్యాంగం హక్కు

రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో ప్రధానమైనది ఓటు హక్కు అని జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి విద్యార్థులకు సూచించారు.

Published : 04 Dec 2022 01:41 IST

మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి

బళ్లారి, న్యూస్‌టుడే: రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో ప్రధానమైనది ఓటు హక్కు అని జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి విద్యార్థులకు సూచించారు. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ సరళాదేవి సతీశ్చంద్ర అగర్వాల్‌ డిగ్రీ కళాశాల సంయుక్తంగా శనివారం ఏర్పాటు చేసిన ‘విశేష సంక్షిప్త పరిష్కరణె-2023’ కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి ప్రారంభించి మాట్లాడారు. మన ఓటు- మన హక్కు అని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. యువతకు అవగాహన కల్పించడానికి డిసెంబరు 9న కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువ ఓటర్లు ఎలాంటి వాటికి లొంగకుండా నిర్భయంగా ఓటు వేసి ప్రజాప్రభుత్వం పటిష్టం చేయాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు ఇతరలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా పోలీస్‌ అధికారి రంజిత్‌కుమార్‌ బండారు, జిల్లా పంచాయతీ సీఈవో జి.లింగమూర్తి, అదనపు జిల్లా పాలనాధికారి మంజునాథ, అసిస్టెంట్‌ కమిషనర్‌ హేమంత్‌, శిక్షణ ఐ.ఎ.ఎస్‌ అధికారి రోపిందర్‌ కౌర్‌, తహసీల్దార్‌ విశ్వనాథ, ప్రధాన ఆచార్యులు మంజునాథరెడ్డి, లీడ్‌ కళాశాల నిర్వహకులు డా.జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రశ్నలు ఇంకా అడుతుండగా డీసీ ఈసీ, ఏడీసీకి దిశా సమావేశం ఉండటంతో వెళ్లి పోయారు.
చెళ్లకెరె(చిత్రదుర్గం): ఓటర్లలో జాగృతి పెంపొందించడానికి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఓటరు అక్షరాస్యతా పోటీలను నిర్వహించారు. శనివారం ఇక్కడి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోటీలను జిల్లా నోడల్‌ అధికారి పరశురామప్ప ప్రారంభించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కారక్రమంలో బీఈఓ తిప్పేస్వామి, ప్రధానోపాధ్యాయురాలు ఆశారాణి, రాజకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని