logo

‘జనార్దన్‌రెడ్డి ఏకవచనంతో మాట్లాడితే ఊరుకోం’

గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్దన్‌రెడ్డి తమను ఏకవచనంలో సంబోధించడం మానుకోవాలని మంత్రి శివరాజ్‌ తంగడిగి హెచ్చరించారు.

Published : 06 May 2024 05:23 IST

గంగావతిలో మాట్లాడుతున్న శివరాజ్‌ తంగడిగి

గంగావతి, న్యూస్‌టుడే: గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్దన్‌రెడ్డి తమను ఏకవచనంలో సంబోధించడం మానుకోవాలని మంత్రి శివరాజ్‌ తంగడిగి హెచ్చరించారు. ఆయన ఆదివారం గంగావతిలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తర కర్ణాటక భాషలో తాను ఇంతకంటే దీటుగా సమాధానం ఇవ్వగలనన్నారు. భాజపా నేతలను తృప్తి పరిచేందుకు ఆయన తమను ఏకవచనంలో విమర్శిస్తున్నారన్నారు. రెడ్డి భాష ఉపయోగించాలంటే తమకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. ఆయన శాసనసభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ప్రజలకు రెండు పడక గదుల ఇళ్లు, అంజనాద్రికి రూ.5వేల కోట్లు నెరవేర్చాలన్నారు. భాజపా అభివృద్ధి పేరిట కాకుండా ప్రజల నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఓట్లు కోరడం సమంజసం కాదన్నారు. మాజీ మంత్రి ఇక్బాల్‌ అన్సారీ, కొప్పళ శాసనసభ్యుడు రాఘవేంద్ర హిట్నాళ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని