logo

రాజధానిలో వాన జోరు

ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు,చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

Published : 07 May 2024 03:34 IST

జోరువానకు బెంగళూరు సెంట్రల్‌లో పలచగా మారిన ట్రాఫిక్‌
బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు, చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బెంగళూరులో సాయంత్రం ఐదు నుంచి ఏడున్నర వరకు కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు, అంతర్జాల సేవలు నిలిచిపోయాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బస్టాండ్‌, రైల్వేస్టేషన్లకు వెళుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విరిగిన చెట్టు కొమ్మలు తొలగించేందుకు, బిలమార్గాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు పాలికె, బెస్కాం, జలమండలి సిబ్బంది సంయుక్తంగా కార్యాచరణ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని