logo

చిన్న పరిశ్రమలకు పురస్కారాలు

ఏటా రూ.250 కోట్ల కన్నా తక్కువ లావాదేవీలను నిర్వహిస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని టాలీ సొల్యూషన్స్‌ ప్రకటించింది.

Published : 09 May 2024 06:42 IST

జయంతి సింగ్‌
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఏటా రూ.250 కోట్ల కన్నా తక్కువ లావాదేవీలను నిర్వహిస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని టాలీ సొల్యూషన్స్‌ ప్రకటించింది. పోటీకి దరఖాస్తు పంపుకొనే సంస్థలు జీఎస్‌టీ నంబరు కలిగి ఉండడం తప్పనిసరి అని సంస్థ మార్కెటింగ్‌ ప్రతినిధి జయంతి సింగ్‌ బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వివరించారు. మే 31లోగా సంస్థలు తమకు దరఖాస్తులు పంపాలని సూచించారు. ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త, నూతన ఆదర్శ పారిశ్రామికవేత్త, సాంకేతికతలో మార్పుకారకులు, వ్యాపార సాధకులు, ఎంఎస్‌ఎంఈలకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తులకు ఆయా విభాగాల్లో పురస్కారాలు ఉంటాయని తెలిపారు. నాలుగో ఏడాది అందిస్తున్న    పురస్కారాలకు వంద నగరాల నుంచి ఎనిమిది వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నామని చెప్పారు. తమ వెబ్‌సైట్లో పోటీకి సంబంధించిన లింకులు, వివరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని