logo

తాగునీటిని తప్పనిసరిగా పరీక్షించాలి

ప్రజలకు సరఫరా చేసే తాగునీటికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో రామకృష్ణ సూచించారు.

Published : 28 Mar 2024 16:29 IST

పినపాక: ప్రజలకు సరఫరా చేసే తాగునీటికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో రామకృష్ణ సూచించారు. నీటి సరఫరా ట్యాంకులను శుబ్రపరిచే విధానం, నీటికి సరిపడా క్లోరిన్ అందించే విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం ఏఈ విజయకృష్ణ కార్యదర్శులకు క్లోరినేషన్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శులు పాల్గొన్నారు. ఉపాధిహమీ పనికి వచ్చే కూలీల హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని ఎంపీడీవో రామకృష్ణ సూచించారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెల్లింపుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. కూలీల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని