logo

1,105 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు: కలెక్టర్‌

లోక్‌సభ ఎన్నికల కోసం జిల్లాలో 1,105 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ ప్రియాంక అల తెలిపారు.

Updated : 05 May 2024 02:16 IST

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల కోసం జిల్లాలో 1,105 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ ప్రియాంక అల తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం ఇల్లెందు తహసీల్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్ సెంటర్‌ను శనివారం పరిశీలించారు. ఏఆర్‌ఓ కాశయ్య, తహసీల్దార్‌ రవికుమార్‌ను అడిగి ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందికి అయిదు కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. శుక్ర, శనివారాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం హోం ఓటింగ్‌ నిర్వహించామని చెప్పారు. జిల్లాలో 239 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, సీసీ కెమెరాల సాయంతో వాటిలో పోలింగ్‌ తీరును పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎన్నికల విధుల్లో 6వేల మంది సిబ్బంది పాల్గొననున్నట్టు వెల్లడించారు. పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు.  అధికారులు ముత్తయ్య, పద్మ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని