logo

‘కాంగ్రెస్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దు’

కాంగ్రెస్‌ చెప్పే బూటకపు మాటలు నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.

Published : 09 May 2024 03:24 IST

 సత్తుపల్లిలో మాట్లాడుతున్న భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు
సత్తుపల్లి, పెనుబల్లి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ చెప్పే బూటకపు మాటలు నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలోని భారాస బూత్‌ కమిటీలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం సత్తుపల్లి మండలం, పెనుబల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం చేశారు. అలవికాని హామీలతో కాంగ్రెస్‌ రాష్ట్రంలో గద్దెనెక్కిందని విమర్శించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఖమ్మం లోక్‌సభ స్థానంలో భారాస విజయం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో తాగు, సాగునీటి ఇక్కట్లతో పాటు విద్యుత్తు సమస్య వెంటాడుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కేసీఆర్‌, కేటీఆర్‌ సహకారంతో సత్తుపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. సత్తుపల్లి పుర ఛైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, జడ్పీటీసీ సభ్యుడు కూసంపూడి రామారావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, రఫీ, అనిల్‌కుమార్‌, సూరిబాబు, బాబీ పాల్గొన్నారు. కల్లూరు మండలం కప్పలబంధానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు శీలం నారాయణరెడ్డి భారాసలో చేరారు. ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చక్కిలాల మోహన్‌రావు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కనగాల వెంకట్రావు, భుక్యా ప్రసాద్‌ పాల్గొన్నారు.

బోనకల్లు: ఎంపీగా కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి, జిల్లాకు అనేక నిధులు తీసుకొచ్చానని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. శాసనసభ ఎన్నికల సమంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్‌ సర్కారు విఫలమైందని విమర్శించారు. తన ప్రాణాలు పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన యోధుడు కేసీఆర్‌ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ది పథంలో నడవాలంటే భారాసను బలపర్చాలని ప్రజలను కోరారు. నామా నాగేశ్వరరావును మరోమారు ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, కొండబాల కోటేశ్వరరావు, మల్లికార్జున్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని