logo

తప్పులు లేని ఓటరు జాబితా రూపొందిద్దాం

ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా రూపొందించాలని ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు.

Published : 27 Nov 2022 02:34 IST

ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ మురళీధర్‌రెడ్డి

మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు మురళీధర్‌రెడ్డి, పక్కన కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా రూపొందించాలని ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక ఓటరు నమోదు, సవరణపై కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌తో కలిసి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారులు (ఈఆర్వోలు), ఏఈఆర్వోలు (తహసీల్దార్లు), వివిధ పార్టీల నాయకులతో కలెక్టరేట్‌లో శనివారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ వంద శాతం తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి పార్టీలు సహకరించాలన్నారు. 18 ఏళ్ల వయస్సు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్లుగా నమోదు చేయించాలని, ప్రత్యేకించి కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆధార్‌-ఓటరు అనుసంధానం కార్యక్రమం జరుగుతోందని.. ఫలితంగా డూప్లికేట్‌ ఓటర్లకు అవకాశం ఉండదన్నారు.  కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ బీఎల్‌వోలతో సమన్వయం చేసుకునేందుకు వీలుగా రాజకీయ పార్టీలు పోలింగ్‌ కేంద్రాలకు బీఎల్‌ఏలను నియమించుకోవాలన్నారు. కాంగ్రెస్‌, తెదేపా నాయకులు కరుణాకర్‌ బాబు, జస్వంత్‌ పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి డీఆర్వో మల్లికార్జునుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని