logo

గుట్టుగా ట్యాబ్‌ల పంపిణీ

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్సాహం చూపుతున్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ట్యాబ్‌ల పంపిణీ విషయం చర్చనీయాంశంగా మారింది.

Published : 20 Apr 2024 05:01 IST

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన  

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్సాహం చూపుతున్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ట్యాబ్‌ల పంపిణీ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ పాఠశాలలో 8వ తరగతిలో 19 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ట్యాబ్‌లు ఇచ్చేందుకుగాను జనవరి 20వ తేదీన మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి సరఫరా చేశారు. అప్పటినుంచి పంపిణీ చేయకుండా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉండగా ట్యాబ్‌లు ఎలా పంపిణీ చేస్తారంటూ స్థానిక నేతలు పేర్కొంటున్నారు. ఇదికూడా తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో జరగడం గమనార్హం. ఈ విషయమై పాఠశాల హెచ్‌ఎం శేషఫణి రాజు మాట్లాడుతూ పిల్లలకు ఇస్తే చెడిపోతాయనే ఉద్దేశంతో తమవద్ద అలానే ఉంచినట్లు చెప్పారు. ట్యాబ్‌కు చెందిన ఎస్‌డీ కార్డులు ఈనెల మొదటి వారంలో వచ్చాయని, ఎస్‌డీ కార్డులు వచ్చిన తర్వాత రెండింటిని కలిపి విద్యార్థులకు ఇచ్చామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లపై ప్రభుత్వ స్టిక్కర్లు లేవన్నారు. ఈ విషయమై డీఈవో శ్యాముల్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా విచారణ చేయిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని