logo

జగన్‌ పాలనలో రైతుల పరిస్థితి దారుణం

తెదేపా ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఆలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 03 May 2024 04:05 IST

తిక్కారెడ్డి

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే : తెదేపా ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఆలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా కూటమి ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా ఉందన్నారు. ఆలూరు నియోజకవర్గంలో తాగు, సాగు నీరు అందాలంటే ఆలూరు అభ్యర్థి వీరభద్రగౌడ్‌, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజులను గెలిపించాలి కోరారు. జగన్‌ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ.. తెదేపా కూటమి 120 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్నారు. వైకాపా ప్రభుత్వం జిల్లాలో తాగు, సాగు నీరు అందించేందుకు, వలసల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆలూరు అభివృద్ధి చెందాలంటే వీరభద్రగౌడ్‌ను గెలిపించాలని కోరారు. వేదవతి జలాశయం తెదేపాతోనే పూర్తవుతుందన్నారు. సమావేశంలో నాయకులు నర్సప్ప, నారాయణ, బెంగళూరు కిశోర్‌, నాగరాజు, చంద్రశేఖర్‌, ప్రసాద్‌, కొమ్ము రామాంజి, రవి, కేశన్న పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని