logo

నేటి నుంచి ఉద్యోగుల ఓటు

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటూ.. దరఖాస్తు చేసుకున్న వారందరికి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చు.

Published : 06 May 2024 03:24 IST

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి ఆరు కేంద్రాలు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటూ.. దరఖాస్తు చేసుకున్న వారందరికి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చు. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి ప్రస్తుతం శిక్షణ ఇస్తున్న చోటే ఓటుహక్కు వినియోగించుకునేలా ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీవోలు, సూక్ష్మ పరిశీలకులు తదితరులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించారు.

17,939 మందికి అవకాశం

జిల్లాలో మొత్తం 17,939 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు ఉన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 3,372, బనగానపల్లి 2,858, డోన్‌ 1,970, నందికొట్కూరు 2,224, నంద్యాల 4,800, శ్రీశైలం నియోజకవర్గంలో 2,715 మంది ఎన్నికల విధులు, అత్యవసర సేవలకు సంబంధించిన శాఖల ఉద్యోగులు ఉన్నారు.

  • నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నంద్యాల పట్టణంలోని బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫెసిలిటేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు.
  • ఆళ్లగడ్డ వైపీసీఎం జూనియర్‌ కళాశాలలో, బనగానపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నందికొట్కూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, డోన్‌ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
  • పాణ్యం, గడివేముల మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మొదట ఎక్కడ శిక్షణ పొందారో ఆ ప్రాంతాల్లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు సూచించారు.
  • ఇతర ప్రాంతాల్లో ఉన్న సిబ్బందికి డ్యూటీ ఆర్డర్‌ ఉండి ఫార్మ్‌-12డీ ఇవ్వకపోతే ఈనెల 8న ఆయా ప్రాంతాలకు వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసే సౌకర్యం ఉంది. ఎన్నికల విధుల ఆర్డర్‌ ఉండి ఇంకా ఫార్మ్‌-12డీ తీసుకోని ఉద్యోగులు కూడా సంబంధిత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఫార్మ్‌-12డీ తీసుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని