logo

ఓటెత్తిన ఉద్యోగులు

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగానికి ఉద్యోగులు బారులు తీరారు.. వారిని ప్రలోభపెట్టేందుకు వైకాపా నాయకులు శతవిధాల ప్రయత్నం చేశారు.. వారిని ఉద్యోగులు ఏమాత్రం పట్టించుకోలేదు..

Published : 08 May 2024 01:54 IST

ఈనాడు, కర్నూలు: పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగానికి ఉద్యోగులు బారులు తీరారు.. వారిని ప్రలోభపెట్టేందుకు వైకాపా నాయకులు శతవిధాల ప్రయత్నం చేశారు.. వారిని ఉద్యోగులు ఏమాత్రం పట్టించుకోలేదు.. కొందరైతే మీరెవరంటూ నిలదీశారు.. ఓటు హక్కు వినియోగానికి ఉద్యోగులు భారీగా తరలివస్తుండటంతో వైకాపా నేతల్లో వణుకు మొదలైంది. రెండు రోజుల్లో 14,207 (69.80 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.   


న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం: పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగానికి ఉద్యోగులు బారులు తీరారు.. రెండో రోజు మంగళవారం ఆరు నియోజకవర్గాల్లో రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. రెండు రోజుల్లో 12,694 మంది వినియోగించుకున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 1818, శ్రీశైలంలో 1491 , నందికొట్కూరులో 2056, డోన్‌లో 2209, నంద్యాలలో 3068, బనగానపల్లెలో 2052 మంది ఓటేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని