logo

రండి రండి.. ఓటుకు రూ.3 వేలు

నందికొట్కూరులో రెండో రోజు మంగళవారం పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు వైకాపా నాయకులు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చి ఓటు వేసేటప్పుడు తమకు చూపించివేయాలన్నారు.

Published : 08 May 2024 02:04 IST

నందికొట్కూరు, న్యూస్‌టుడే : నందికొట్కూరులో రెండో రోజు మంగళవారం పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు వైకాపా నాయకులు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చి ఓటు వేసేటప్పుడు తమకు చూపించివేయాలన్నారు. దీంతో కొందరు డబ్బు తీసుకుని వైకాపా నాయకుడి వెంట వెళ్లి ఓటు వేసి వచ్చారు. మరికొందరు కేంద్రంలోకి వచ్చి ఇలా చేయడమేంటని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. అలాగే కేంద్రం వద్ద పోస్టల్‌ ఓటర్ల జాబితా గోడకు అతికించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పోస్టల్‌ బ్యాలట్‌కు సంబంధించిన కవర్లు చెత్తలో దర్శనమిచ్చాయి.

ఆత్మకూరు, న్యూస్‌టుడే:  ఆత్మకూరులోని ఎన్నికల కేంద్రం వద్ద రెండో రోజు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీశైల నియోజకవర్గంలో విధులు కేటాయించిన ఉద్యోగుల పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన చెందారు. తమ ఓటు హక్కు ఎక్కడుందని ప్రశ్నిస్తుంటే అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. గడువు పెంచి అందరూ ఓటు వినియోగించుకోనేలా చూడాలన్నారు. మరి కొందరు కేంద్రం వద్ద గెజిట్‌ సంతకం, సీల్‌ వేయించుకునేందుకు సంబంధిత అధికారుల కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.


ఓటుకు రూ.2 వేలు

చరవాణికి ఓటీపీ వస్తేనే డబ్బులు

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఆత్మకూరు పురపాలక సంఘంలోని వార్డుల్లో మంగళవారం వైకాపా నాయకులు ఇంటింటికి వెళ్లి రూ.2 వేల నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. పంపిణీ ముందురోజు ఇంటింటికి వెళ్లి టోకెన్లు అందజేశారు. టోకెన్‌ ఇచ్చిన ఇంటికెళ్లి డబ్బులు పంపిణీ చేసే ముందు ఓటర్ల చరవాణి తీసుకొని టోల్‌ ఫ్రీ నంబరుకు డయల్‌ చేస్తున్నారు. అనంతరం చరవాణికి వచ్చిన ఓటీపీ నంబరును రాసుకొని నగదు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు , ఎన్నికల అధికారులు  ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని