logo

తొడలోకి దూసుకెళ్లిన చెట్టుకొమ్మ

ఓ యువకుడి తొడలోకి చెట్టు కొమ్మ దూసుకెళ్లి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా కర్నూలు సర్వజన ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మాలిక్‌ (21) ట్రాక్టర్‌ డ్రైవరుగా ఉన్నారు.

Published : 09 May 2024 03:16 IST

క్లిష్టమైన ఆపరేషన్‌ చేసి ప్రాణాలు నిలిపిన డాక్టర్లు
కర్నూలు సర్వజన ఆస్పత్రి వైద్యుల ఘనత

వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : ఓ యువకుడి తొడలోకి చెట్టు కొమ్మ దూసుకెళ్లి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా కర్నూలు సర్వజన ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మాలిక్‌ (21) ట్రాక్టర్‌ డ్రైవరుగా ఉన్నారు. ఈనెల 2న ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు బోల్తా పడిన ఘటనలో అతని తొడలోకి చెట్టు కొమ్మ బలంగా దూసుకెళ్లింది. వెంటనే అతడిని కర్నూలు సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనస్థీషియా వైద్యురాలు సంధ్య, వైద్యులు విజయ్‌శంకర్‌, భాస్కరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, అనూషా కలిసి 2వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా చేసి తొడలోకి దిగిన చెట్టు కొమ్మను జాగ్రత్తగా తొలగించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకోవడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. అతనికి ఆరోగ్యశ్రీ లేకున్నా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ వెంకటరంగారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు కేవలం బోధనా ఆస్పత్రుల్లోనే సాధ్యమవుతాయని చెప్పారు. మొదట ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియోథొరాసిక్‌ విభాగంతోపాటు వివిధ విభాగాల వైద్యులు పరిశీలించి పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత జనరల్‌ సర్జరీ వైద్యులు డాక్టర్‌ చక్రవర్తి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ విశాల ఆధ్వర్యంలో వైద్యులు విజయవంతంగా ఆపరేషన్‌ చేశారని చెప్పారు. వైద్యాలయంలో గతేడాది సుమారు 17,798 శస్త్రచికిత్సలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చిట్టినరసమ్మ, డాక్టర్‌ చక్రవర్తి, డాక్టర్‌ విజయ్‌శంకర్‌, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ విశాల, జనరల్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ హరిచరణ్‌, డాక్టర్‌ రామకృష్ణనాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని