logo

ఘనంగా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు

జిల్లా కేంద్రంలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Updated : 10 May 2024 13:24 IST

నంద్యాల గాంధీచౌక్‌: జిల్లా కేంద్రంలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బైర్మల్ వీధిలోని బసవేశ్వర ఆలయంలో సంఘ సంస్కర్త పరమాత్మ బసవేశ్వర స్వామి జయంతి వేడుకల్లో వీరసేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు శశిభూషణ సిద్ధాంతి, వీరశైవ సంక్షేమ సమాజం అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ.. సమాజంలో కులాలను, మతాలను రూపుమాపేందుకు తొలి అడుగు వేసిన మొట్టమొదటి సంఘసంస్కర్త బసవేశ్వరుడు అన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, కిషోర్, మల్లికార్జున, శ్రీనివాసులు, శివప్ప, మల్లప్ప, నాగేశ్వరప్ప, ప్రసాదు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని