logo

ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్‌

ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్‌సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు.

Published : 20 Apr 2024 03:42 IST

 కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ముగ్గు పరిశీలిస్తున్న కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్‌సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. స్వీప్‌యాక్టివిటీలో భాగంగా స్వీప్‌ నోడల్‌ అధికారి రామమహేశ్వర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అధికారులు ప్రజలకు చెప్పి ఓటు వేసేలా కృషి చేయాలన్నారు. ఆవరణలో మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, వారిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీడబ్ల్యూవో లక్ష్మీబాయి, డీఆర్డీవో నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

వనపర్తి న్యూటౌన్‌: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ, ఇంజినీరింగ్‌ అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో అసవరమైన ఫ్యాన్లు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, బోర్డులు తదితర ఏర్పాట్లు చేసుకునే   అవకాశముందన్నారు. పాఠశాలల కమిటీల పేరుతో బ్యాంకు ఖాతా తెరవాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యేలోగా అన్ని పాఠశాలలను ఆదర్శంగా చేయాలన్నారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఇంజినీరింగ్‌, విద్యాశాఖ, మండల ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు