logo

ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే..

లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రుచేశ్‌ జైవన్షి, ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరభ్‌ సూచించారు

Published : 01 May 2024 06:31 IST

నాగర్‌కర్నూల్‌ : లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రుచేశ్‌ జైవన్షి, ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరభ్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌తో కలిసి పోటీ చేసే అభ్యర్థులు, వారి ఏజెంట్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు సభలకు, ఇతర కార్యకలాపాలకు ఎన్నికల నియమావళికి లోబడి అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలా ఆవేశపూరితమైనవి, తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయవద్దన్నారు. కోడ్‌ ఉల్లంఘించకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు చేసే ప్రతి పైసా ఎన్నికల వ్యయంలోకి వస్తుందన్నారు. ప్రతి అభ్యర్థి వ్యయ వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చులను ఏ రకంగా లెక్కిస్తారనేది వివరించారు. ఎన్నికల ఖర్చు రూ.95 లక్షలు దాటకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఇబ్బందులు కలిగితే చరవాణి నంబరు 8790015179కు సమాచారం అందించాలన్నారు. ప్రజలు ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చన్నారు. కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజలు తమ ఫిర్యాదులను 1950కి గాని, సీ విజల్‌ యాప్‌ ద్వారా చేయవచ్చన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సువిధ యాప్‌ ద్వారా అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 48 గంటల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని