logo

భారాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే: మంత్రి జూపల్లి

రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయని, కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి మల్లు రవి గెలుపునకు ప్రతి ఒక్కరూ పని చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Published : 05 May 2024 02:15 IST

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

పెంట్లవెల్లి, న్యూస్‌టుడే: రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయని, కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి మల్లు రవి గెలుపునకు ప్రతి ఒక్కరూ పని చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు నిర్వహించిన సమావేశానికి అభ్యర్థి మల్లు రవితో కలిసి హాజరై మాట్లాడారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షల పెంపు, ఉచిత విద్యుత్తు, రూ.500 సిలిండర్‌ వంటి పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయని అన్నారు. భారాస, భాజపా అభ్యర్థులు చెప్పే మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. భారాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లేనని అన్నారు. లోక్‌సభ అభ్యర్థి మల్లురవి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూశారని, రాహుల్‌గాంధీ ప్రధాని అయితే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మదగం నరసింహ, రత్నగిరి ఫౌండేషన్‌ కన్వీనర్‌ కేతురి ధర్మతేజ, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి వంగా భాస్కర్‌ గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కబీర్‌, మాజీ ఎంపీపీ గోవింద్‌ గౌడ్‌, రామన్‌ గౌడ్‌, ఎర్ర శ్రీను, కుమార్‌, శివుడు, శేషు, శివరాజ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని