logo

హస్తం దెబ్బకు కారు షెడ్డుకు

భారాస పదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే అవినీతి బాగా జరిగిందని అందుకే ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పారని నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు.

Published : 05 May 2024 02:19 IST

సమావేశంలో మాట్లాడుతున్న నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి. చిత్రంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

శ్రీరంగాపురం, న్యూస్‌టుడే : భారాస పదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే అవినీతి బాగా జరిగిందని అందుకే ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పారని నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తాటిపాముల, షేరుపల్లి, శ్రీరంగాపురం, కంబాళాపురం గ్రామాల్లో శనివారం రాత్రి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతోందని, అప్పుడే పరుగులు తీయడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామన్నారు. రంగనాథాలయ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న అతిథిగృహాన్ని అభివృద్ధి చేస్తామని, పర్యాటకులకు, భక్తులకు వినోదాన్నిచ్చే బోటింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయిస్తామన్నారు. హస్తం గుర్తుపై ఓటేసి అధిక మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీహరిరాజు, బీరం రాజశేఖర్‌రెడ్డి, వాహిదుద్దీన్‌, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని