logo

మాటలతో మోసం చేశారు: చల్లా

రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికీ జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

Published : 05 May 2024 02:24 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

అలంపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికీ జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం అలంపూర్‌ పట్టణ కేంద్రంలో భారాస ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా, ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, కేవలం మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గతేడాది డిసెంబరు 9వ తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఏ రైతుకూ మాఫీ జరగలేదని, కనీసం రైతు బంధు డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు మరో పర్యాయం ప్రజలను మోసం చేస్తూ కొత్తగా ఆగస్టు 15 వరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ల పైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒట్టు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి దేవుళ్లను వాడుకుంటూ ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బారాస అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని కార్యకర్తలకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని