logo

పకడ్బందీగా పోలింగ్‌ నిర్వహించాలి

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

Published : 07 May 2024 03:05 IST

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కొల్లాపూర్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాలలో ఈవీఎం యంత్రాలపై పోలింగ్‌ సరళిని సోమవారం పరిశీలించారు. కేంద్రాల వారీగా ఈ నెల 13న జరిగే పోలింగ్‌ ఏర్పాట్లను సమీక్షించారు. ఈవీఎం, వీవీ ప్యాట్లు, సామగ్రి తరలింపు తదితర వాటిపై జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, కొల్లాపూర్‌ ఏఆర్‌వో కుమార్‌ దీపక్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌తో చర్చించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్‌ సూచించారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పోలింగ్‌ నిర్వహించాలన్నారు. సోమవారం కూడా పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల పోలింగ్‌ కొనసాగినట్లు తహసీల్దార్‌ శ్రీకాంత్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని