logo

ఈవీఎం స్ట్రాంగ్‌రూం భద్రతా ఏర్పాట్ల పరిశీలన

వనపర్తి మండలం చిట్యాల శివారులో వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ఈవీఎం స్టాంగ్ర్‌ రూంను ఎస్పీ రక్షితకృష్ణమూర్తి బుధవారం పరిశీలించారు.

Updated : 09 May 2024 06:38 IST

చిట్యాలలోని స్టాంగ్ర్‌ రూô వద్ద రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ రక్షితకృష్ణమూర్తి

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: వనపర్తి మండలం చిట్యాల శివారులో వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ఈవీఎం స్టాంగ్ర్‌ రూంను ఎస్పీ రక్షితకృష్ణమూర్తి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ  రిజిస్టర్‌ను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఏఆర్‌ ఏఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నాగభూషణం, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

కేంద్ర హోంమంత్రి సభాస్థలి పరిశీలన

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 11న వనపర్తిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో నిర్వహించే సభస్థలాన్ని, హెలిప్యాడ్‌, గ్యాలరీ ఏర్పాట్లను బుధవారం ఎస్పీ రక్షితకృష్ణమూర్తి పరిశీలించారు. బందోబస్తు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాహనాల దారి మళ్లింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా వనపర్తికి వచ్చిన కేంద్రబలగాలకు, కర్ణాటక పోలీసులకు ఏర్పాటు చేసిన వసతులను ఆమె పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని