logo
Updated : 27/11/2021 01:12 IST

బావిలో పడి చిన్నారి మృతి

ఆశారాణి

జహీరాబాద్‌ అర్బన్‌: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందినట్లు జహీరాబాద్‌ గ్రామీణ ఎస్‌ఐ రవి తెలిపారు. కర్ణాటకలోని బీదర్‌ జిల్లా గుడుపల్లికి చెందిన రాథోడ్‌ శివాజీ-సునీత దంపతులు కూతురు ఆశారాణి(8)తో కలిసి గురువారం జహీరాబాద్‌ మండలం హోతి(బి)లో చెరకు నరికేందుకు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం కూతురుతో కలిసి భోజనం చేసిన తల్లిదండ్రులు మళ్లీ పనుల్లో నిమగ్నమయ్యారు. తదుపరి కొద్దిసేపట్లోనే బావిలో శబ్దం రావడంతో హుటాహుటిన వచ్చి చూడగా... నీళ్ల బుడగలు రావడంతోపాటు చిన్నారి ఆశారాణి కనిపించకపోవడంతో ఆనుమానంతో బావిలో దిగి వెతికారు. అప్పటికే కొద్ది సమయం కావడంతో చిన్నారి నీళ్లు మింగి మృతిచెందింది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై విలపించడం స్థానికులను కలచివేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవపరీక్షల అనంతరం మృతదేహన్ని అప్పగించినట్లు ఎస్సై పేర్కొన్నారు.


క్రేన్‌ పైనుంచి పడి కార్మికుడు..

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఎత్తు పైనుంచి పడి తీవ్ర గాయాలై కార్మికుడు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ పారిశ్రామికవాడలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపిన వివరాలు.. కాళ్లకల్‌లోని ఓ పరిశ్రమలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బలియా జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ రామ్‌(42) కొన్నేళ్లుగా ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నాడు. భారీ క్రేన్‌ పైకి ఎక్కి శుభ్రం చేస్తుండగా కిందపడటంతో ముఖం, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. తోటి సిబ్బంది క్షతగ్రాతుడిని చికిత్స నిమిత్తం పరిశ్రమలోని అంబులెన్సులో మేడ్చల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆ రాష్ట్రం నుంచి కుటుంబీకులు వచ్చే వరకు మృతదేహాన్ని తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరుస్తామని చెప్పారు.


Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని