‘పది’ పరీక్షలకు 98 % హాజరు
మెదక్‌లోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రంలోకి వెళ్తూ..
మెదక్, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మొదటి భాష (పేపర్-1) పరీక్ష జరిగింది. తొలి రోజు 98.84 శాతం మంది హాజరయ్యారు. 11,393 మంది పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా 72 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 11,261 మంది పరీక్ష రాయగా, 132 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులు ఉదయం 8 గంటల వరకే కేంద్రాలకు చేరుకున్నారు. 8.30కు లోపలికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యం చెప్పి పంపించారు. డీఈవో రమేశ్ మెదక్, పాపన్నపేటలోని కేంద్రాలను తనిఖీ చేశారు. శివ్వంపేటలోని పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర మోడల్ స్కూల్ సొసైటీ (టీఎస్‌ఎంఎస్) డైరెక్టర్ ఉషారాణి తనిఖీ చేశారు.
జిల్లా కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
శస్త్రచికిత్స జరిగినా..
రామాయంపేట, కౌడిపల్లి, న్యూస్‌టుడే: రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన సంపత్ కుమార్‌కు ఏడు రోజుల క్రితం అపెండిక్స్ శస్త్రచికిత్స జరిగింది. అతడికి ఇంకా కుట్టు విప్పలేదు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో కుటుంబ సభ్యుల సాయంతో హాజరయ్యారు. రామాయంపేట పట్టణ శివారులోని ఆదర్శ పాఠశాలలో చదివారు. మాసాయిపేట మండలం కోనాయిపల్లి గ్రామానికి కె.శశివర్ధన్‌కు సైతం అపెండిక్స్ శస్త్రచికిత్స పది రోజుల కిందట జరిగింది. ఈయన కౌడిపల్లిలోని బీసీ గురుకుల పాఠశాలలో పరీక్ష రాశారు. తండ్రి మహేశ్ సాయంతో కేంద్రానికి వచ్చాడు.
తొలి రోజు సజావుగా ‘పది’ పరీక్షలు
99.61 శాతం విద్యార్థుల హాజరు
న్యూస్‌టుడే, సిద్దిపేట
జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జడ్పీ ఉన్నత పాఠశాల గేటుకు గడియారం..
సంగారెడ్డి జిల్లాలో.. తొలిరోజు సజావుగా పది పరీక్షలు
సంగారెడ్డిలో పరీక్ష కేంద్రంలో వరుసలో వెళుతున్న విద్యార్థులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం సజావుగా ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తరువాత పరీక్షలు జరుగుతుండడంతో విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం 8 గంటలకే కేంద్రాలకు తీసుకువచ్చారు. భయపడవ్దదని, ధైర్యంగా రాయాలని సూచనలు చేశారు. తొలి రోజు తెలుగు పరీక్షకు మొత్తం 22,555 మందికి 22,346 మంది పరీక్ష రాశారు. సంగారెడ్డిలోని కరుణ ఉన్నత పాఠశాలలో రెండు కేంద్రాలను అదనపు పాలనాధికారి వీరారెడ్డి, కొండాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలను అదనపు పాలనాధికారి రాజర్షిషా, సంగారెడ్డి, కంది, సదాశివపేటలోని కేంద్రాలను జిల్లా విద్యాధికారి రాజేష్ పరిశీలించారు.
ఆఖరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసు...
బాలికను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న కానిస్టేబుల్
హత్నూర: బోర్పట్ల గ్రామానికి చెందిన గంగోత్రికి హత్నూరలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఈ విషయంలో అవగాహన లేని గంగోత్రి హత్నూరలోని బాలురు ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంది. అప్పటికే విద్యార్థులంతా కేంద్రం లోపలికి వెళ్లారు. అక్కడి నోటీస్ బోర్డుపై తన హాల్‌టికెట్ సంఖ్య కనిపించకపోవడంతో ఆమె కంగారు పడింది. చీఫ్ సూపరింటెండెంట్ రాజిరెడ్డి గుర్తించి పరీక్ష కేంద్రం గురుకుల పాఠశాల అని చెప్పడంతో అక్కడికి ఎలా వెళ్లాలో తెలియక బోరున విలపించింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రవికుమార్ వెంటనే స్పందించి బాలికను తన ద్విచక్ర వాహనంపైన తీసుకెళ్లి ఆఖరి నిమిషంలో కేంద్రానికి చేర్చారు. కానిస్టేబుల్ సకాలంలో స్పందించి విద్యార్థినిని కేంద్రానికి చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
GST compensation cess: జీఎస్టీ పరిహార సెస్సు మరో నాలుగేళ్లు
-
Movies News
Y Vijaya: ఆర్థికంగా నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం విజయశాంతినే: వై.విజయ
-
Politics News
Eknath Shinde: మా కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే.. ఠాక్రే, పవార్‌దే బాధ్యత
-
Politics News
Andhra News: ప్రభుత్వ మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు: తెదేపా
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
-
General News
Secunderabad violence: ఆవుల సుబ్బారావుకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం