logo

రూ.అరకోటి విలువైన సర్కారు స్థలం కబ్జా

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో.. సాయిబాబా దేవాలయం కమాన్‌ ఎదుట రూ.అరకోటి విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయింది.

Published : 30 Jan 2023 02:56 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో.. సాయిబాబా దేవాలయం కమాన్‌ ఎదుట రూ.అరకోటి విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయింది. సర్వే నంబరు 374లో 20 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత మందికి గతంలో ఉచితంగా పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన 100 గజాల స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. ఈ ప్రాంతంలో గజం విలువ రూ.50 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన రూ.50 లక్షల విలువైన భూమి పరాధీనమవుతోంది. చుట్టూ సిమెంటు తాత్కాలిక గోడలు ఏర్పాటు చేశారు. పట్టణంలో దర్జాగా కబ్జా చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్‌, పురపాలక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. ఈ విషయంపై సంగారెడ్డి పట్టణ ప్రణాళిక విభాగం అధికారి కరుణాకర్‌ను వివరణ కోరగా.. ఆక్రమణ విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత వ్యక్తిని ఆధార పత్రాలు తీసుకొని రావాలని సూచించామని, మరో రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించనున్నట్టు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని