logo

Komuravelle: కొమురవెల్లిలో 1 నుంచి ‘మల్లన్న’ మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత

కొమురవెల్లి మల్లికార్జునస్వామి మూలవిరాట్‌ (నిజరూప) దర్శనం జనవరి 1 (సోమవారం)వ తేదీ సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరు బాలాజీ వెల్లడించారు. శుక్రవారం ఈవో కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 7న స్వామి కల్యాణంతో పాటు జాతర ప్రారంభం కానుందన్నారు

Updated : 30 Dec 2023 10:27 IST

చేర్యాల, న్యూస్‌టుడే: కొమురవెల్లి మల్లికార్జునస్వామి మూలవిరాట్‌ (నిజరూప) దర్శనం జనవరి 1 (సోమవారం)వ తేదీ సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరు బాలాజీ వెల్లడించారు. శుక్రవారం ఈవో కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 7న స్వామి కల్యాణంతో పాటు జాతర ప్రారంభం కానుందన్నారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు ఆలయ సుందరీకరణ, గర్భగుడిలోని స్వామి, అమ్మవార్ల మూలవిరాట్‌ విగ్రహాలను అలంకరిస్తారని చెప్పారు. ఈ మేరకు దర్శనాన్ని బంద్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 31 రాత్రి నుంచే దర్శనం నిలిపివేయాల్సి ఉండగా, మరుసటి రోజు సోమవారం నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున నిర్ణయాన్ని మార్చినట్లు వివరించారు. జనవరి 2 ఉదయం నుంచి అర్థమండపంలోనే ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తామని, విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని