logo

ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్‌ వీడియో

చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు..

Published : 19 Apr 2024 08:57 IST

రక్షించిన పోలీసులు

వంశీని వారిస్తూ..

అల్లాదుర్గం, న్యూస్‌టుడే: చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. మండలంలోని ముస్లాపూర్‌కు చెందిన వంశీ.. సంగారెడ్డి సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అత్తామామతోపాటు బంధువులు మోసం చేశారని, మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని గురువారం వాట్సాప్‌లో వీడియో పోస్టు చేశాడు. ‘నాకున్న రెండెకరాల భూమి, ఇంటి స్థలాన్ని అనాథాశ్రమానికి లేదంటే ట్రస్టుకు ఇవ్వండి. నా భార్యకు మాత్రం ఇవ్వరాదు. ఎస్సై ప్రవీణ్‌రెడ్డి సార్‌, సీఐ రేణుక మేడం.. నా మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించండి.. మిస్‌ యూ కన్నా (కొడుకును ఉద్దేశించి)’ అంటూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రవీణ్‌రెడ్డి, కానిస్టేబుల్‌తో కలిసి ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా గ్రామ శివారులోని బల్కం చెరువు కట్ట సమీపంలోని పొలం వద్ద వంశీ ఆచూకీ కనుగొన్నారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని