logo

సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం

సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్‌ సబార్డినేట్‌గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు.

Published : 24 Apr 2024 03:18 IST

ప్రశాంతికి నియామకపత్రం అందిస్తున్న సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం, జడ్జిలు స్వాతిరెడ్డి, మురళిమోహన్‌
సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్‌ సబార్డినేట్‌గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి రఘురాం మాట్లాడుతూ.. సమాజంలో హిజ్రాలకు సమాన హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిద్దిపేటలో మొదటిసారిగా హిజ్రాకు ఉద్యోగావకాశం కల్పించామన్నారు. వారు ఆత్మన్యూనతా భావానికి లోనవకుండా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రశాంతిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి మురళిమోహన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని