logo

రెండు కళ్లూ చాలవులే..

కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది.

Updated : 03 May 2024 05:59 IST

అంగరంగ వైభవంగా ఒకే వేదికపై సీతారాములు, పార్వతిపరమేశ్వరుల కల్యాణోత్సవాలు

కల్యాణ తంతు నిర్వహిస్తున్న అర్చకులు

గజ్వేల్‌ గ్రామీణ, గజ్వేల్‌, న్యూస్‌టుడే: కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. భువనైక మోహనాకారులైన ఆ పెళ్లి జంటలను ఒకే వేదికపై కనులారా తిలకించిన పెళ్లి పెద్దలైన భక్తజనులు పులకించిపోయారు. గజ్వేల్‌లోని సీతారాములు, ఉమామహేశ్వరుల కల్యాణోత్సవాలు గురువారం రాత్రి ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా జరిగాయి. దేవతాముర్తులను స్థానిక అంగడిపేట హనుమాన్‌ ఆలయం నుంచి వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ తోట శ్రీకాంత్‌రావు పట్టువస్తాల్రు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేదపండితులు శాస్తోక్త్రంగా కల్యాణతంతు నిర్వహించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్సీ రాజమౌళి, గాడిపల్లి భాస్కర్‌, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్‌రావు, దర్మకర్తలు దేశపతి రాజశేఖరశర్మ, విఠాల నర్సింహరామశర్మ, సాయికృష్ణశర్మ, మరం నవీన్‌కుమార్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

దివ్యమైన తలంబ్రాలు.. ప్రాచుర్యానికి ఆనవాళ్లు

భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి కలిపిన తలంబ్రాలను కొన్ని గజ్వేల్‌కు తీసుకొచ్చి శివకేశవుల వివాహ వేడుకలో ఉపయోగించే తలంబ్రాల్లో కలపడం ఆనవాయితీ. గోటి తలంబ్రాలతో పూర్వం నిర్వహించిన ఈ వేడుక ఇన్నేళ్ల తర్వాత గజ్వేల్‌ రామకోటి భక్త సమాజం కృషితో మళ్లీ ఆవిష్కృతమైంది. గజ్వేల్‌లోని సీతారామ, ఉమామహేశ్వరాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రీరామనవమి రోజున ఇక్కడి నుంచి కాలినడకన భద్రాచలం వెళ్లి ఉత్సవం తిలకించి అక్కడి తలంబ్రాలు తెచ్చి కలిపేవారు. ఈ కార్యక్రమం కొన్నేళ్ల పాటు నిలిచిపోయింది. మళ్లీ రామకోటి భక్త సమాజం సేవా సమితి చొరవతో పునరుద్ధరణకు నోచుకుంది. ఈ విషయమై రామకోటి రామరాజు మాట్లాడుతూ.. భద్రాచలం ఆలయ నిర్వాహకులు వడ్లు పంపించగా గోటితో తలంబ్రాలు ఒలిచి పంపించామని చెప్పారు. మళ్లీ అక్కడి నుంచి తలంబ్రాలు గజ్వేల్‌లో సీతారాముల కల్యాణోత్సవానికి వినియోగిండచం రామయ్య కృపగా భావిస్తున్నామన్నారు. ఏటా ఈ బాధ్యతను భక్తితో కొనసాగిస్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని