logo

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే

‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది.

Published : 03 May 2024 01:36 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు

ప్రసంగిస్తున్న హరీశ్‌రావు, పక్కన  వెంకట్రామిరెడ్డి,  సునీతారెడ్డి

హత్నూర, గుమ్మడిదల, జిన్నారం, న్యూస్‌టుడే: ‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలను ఆమోదించినట్లేనని..’ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం జిన్నారం, గుమ్మడిదల, హత్నూర మండలం దౌల్తాబాద్‌లో భారాస ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్‌ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్‌ నేతలు.. మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్‌, భాజపాలకు లోలోన దోస్తీ ఉందని.. ఆ రెండు పార్టీలకు మెదక్‌ గడ్డపై స్థానం లేదన్నారు.  కేసీఆర్‌ తనకు అత్యంత సన్నిహితుడని చెప్పుకొనే మదన్‌రెడ్డిని రెండు సార్లు ఎమ్మెల్యేని చేస్తే.. పార్టీ మారార[ని, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. గతంలో వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ మారాలని భాజపా, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు భారాస శ్రేణులపై ఒత్తిడి తెస్తున్నారని, వారి మాయ మాటలు నమ్మవద్దని కోరారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, నేతలు దేవేందర్‌రెడ్డి, చంద్రాగౌడ్‌, జడ్పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, ఎంపీపీ సద్ది ప్రవీణ, జడ్పీటీసీ సభ్యుడు కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్‌షోకు హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని