logo

నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం

నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎస్పీ చెన్నూరి రూపేష్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌, సుబ్బారావు, రవి గౌడ్‌ ముఠాగా ఏర్పడ్డారు.

Published : 02 May 2024 06:10 IST

ముగ్గురు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రూపేష్‌

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎస్పీ చెన్నూరి రూపేష్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌, సుబ్బారావు, రవి గౌడ్‌ ముఠాగా ఏర్పడ్డారు. అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అమీన్‌పూర్‌, రామేశ్వరం బండ ప్రాంతాల్లోని ఖాళీ ప్లాట్ల యజమానుల వివరాలు సేకరించి నకిలీ పత్రాలు సృష్టించారు. వీటిలో ఆధార్‌, ఫ్యామిలీ సభ్యుల ఇతరత్రా పత్రాలు సైతం ఉన్నాయి. అక్రమ మార్గాల్లో 15 స్థలాలను విక్రయించి.. సుమారు రూ.15 కోట్లు ఆర్జించారు. ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేసి ముగ్గరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమగ్ర విచారణ చేస్తామని, బాధ్యులందరిపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థలాలు కొనుగోలు చేసేవారు పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే ముందుకెళ్లాలని ఎస్పీ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని