logo

కాస్త దృష్టిసారిస్తే ఆరోగ్యమే

ఓ వైపు ఎండ తీవ్రత పెరిగింది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సమయంలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ప్రచారం శనివారంతో ముగియనుంది.

Published : 07 May 2024 03:08 IST

వైపు ఎండ తీవ్రత పెరిగింది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సమయంలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ప్రచారం శనివారంతో ముగియనుంది. ఈ తరుణంలో అభ్యర్థులు తమ విజయానికి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమయంలో కాస్త ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతో ఉంది. నిపుణుల సూచనలు ఇలా..

అలసట దరిచేరకుండా..

సమయానికి భోజనం చేయకపోతే అలసట దరిచేరుతుంది. ప్రచార సమయంలో ఊర్లను చుట్టేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం తప్పనిసరి. తేనీరు ఎక్కువగా తాగితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొబ్బరి నీటిని అధికంగా తీసుకుంటే మేలు. ఇక మధుమేహం ఉంటే సకాలంలో మాత్రలు తీసుకోవడం మరువద్దు. వేళకు భోజనం చేయాలి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. హెచ్చు, తగ్గులు ఉంటే మెదడుపై ప్రభావం చూపుతుంది. ః రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. ఎండ తీవ్రతతో తెల్లవారుజామున, సాయంత్రం, రాత్రి సమయాల్లోనే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు, కీలక నేతలకు నిద్ర లోపించే అవకాశం ఉంది. ఇది పలు రుగ్మతలకు దారి తీస్తుంది. వైద్యులు సూచించిన ప్రకారం కనీసం ఏడు గంటల నిద్ర అవసరం.

ఆందోళనకు గురవకుండా..

  • ప్రచారంలో నాయకులు ఆందోళనకు గురవడం సహజమే. ఈ సమయంలో అధిక, అల్ప రక్తపోటు(బీపీ)కు దారి తీస్తుంది. అందుకే నిత్యం రక్తపోటును పరీక్షించుకోవాలి. వైద్యుల సూచనలతో మాత్రలు తీసుకుంటే మంచిది.
  • రోజూ ఉదయం కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఉదయం నడక ఎంతో మేలు. పలువురు నేతలు దీన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. ఉదయం నడకతో పాటు ప్రచారమూ సాగిస్తున్నారు.
  • ప్రచారంలో నెత్తికి టోపీలు ధరించాలి. అవసరమైతే గొడుగులు వాడాలి.
  • ఒత్తిడిగా అనిపిస్తే ప్రశాంత వాతావరణంలో యోగా, ధ్యానం చేస్తే మంచిది.
  • ఉదయం 10 గంటలలోపు ప్రచారం ముగించాలి. సాయంత్రం 5 తర్వాత మళ్లీ మొదలుపెడితే బాగు. అన్నింటి కంటే ప్రధానంగా పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి.

న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని