logo
Published : 27/11/2021 05:15 IST

చేతికొచ్చిన పంట వరదపాలు

గుర్రంపోడు: చేపూరు పెద్దచెరువు ఆయకట్టులో నేలవాలిన పంటను

చూస్తున్న రైతు మారపాక ముత్యాలు

గుర్రంపోడు, న్యూస్‌టుడే: చేపూరులో చెరువుకు దిగువన ఏఎమ్మార్పీ కాల్వకు సమీపంలో రైతు మారపాక ముత్యాలుకు మూడెకరాల పొలం ఉంది. ఇటీవల కురిసిన వర్షానికి వరద నీరంతా ఇతని పొలంలో నిండిపోయింది. అప్పటికే కోతకు వచ్చిన వరి చేను పూర్తిగా నేలవాలింది. సుమారు ఒక ఎకరం పొలంలో వరి పొలం పూర్తిగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. మిగతా రెండెకరాల్లోనూ పంట దెబ్బతిన్నది. తాను ఇప్పటి వరకు రూ.50 వేలు పెట్టుబడిగా పెట్టి సాగు చేయగా తనకు కనీసం రూ.పది వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు మారపాక ముత్యాలు వాపోయాడు.

* గుర్రంపోడు మండలం చేపూరు బొబ్బలాయి చెరువు ఆయకట్టు రైతుల దుస్థితి ఇది. పాతిక ఎకరాల్లో వరి పొలాలు సాగు చేసిన సుమారు 20 మంది రైతుల పరిస్థితి కూడా ఇదే. పంట చేను కోసుకుందామనే సరికి వరద నీరు పంట ఎత్తుకు పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వెళ్లిపోయిన అనంతరం లోతట్టులో ఉన్న పొలాల్లో అడుగు లోతు నీరు చేరింది. దీంతో పంట చేలు పూర్తిగా కుళ్లిపోయాయి. సాగు చేసిన రైతుల పొలాల్లో వరికోత యంత్రాలు కూడా పోలేని పరిస్థితుల్లో తాము సకాలంలో వరికోతలు చేసుకోలేక పోయామని, ప్రస్తుతం పంట పూర్తిగా దెబ్బతిన్నదని భాషపాక బక్కయ్య అనే రైతు పేర్కొన్నాడు. పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని గ్రామ సర్పంచి కట్టెబోయిన విజయ్‌ కోరారు. పంట దెబ్బతిన్నదని అధికారులకు విన్నవించినా ఇంత వరకు కనీసం ఒక్కరు కూడా వచ్చి చూడలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని